ఏడవ రింగ్‌ రోడ్డు వద్ద పేలుడు పదార్థాల గుర్తింపు

- December 15, 2020 , by Maagulf
ఏడవ రింగ్‌ రోడ్డు వద్ద పేలుడు పదార్థాల గుర్తింపు

కువైట్ సిటీ:సాల్మిలోని ఏడవ రింగు రోడ్డు వద్ద పేలుడు పదార్థాల్ని కనుగొన్నారు. వాటిని బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ జాగ్రత్తగా తరలించి ధ్వంసం చేశారు. 1991లో ఇరాకీ సేనలు, లిబరేషన్‌ వార్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన బాంబులుగా వీటిని గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆనాటి ఆ బాంబులు వెలుగు చూసినట్లు అనుమానిస్తున్నారు. ల్యాండ్‌ మైన్‌ అలాగే రెండు షెల్స్‌ని ఏడవ రింగు రోడ్డు వద్ద గుర్తించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com