శబ్ద కాలుష్య వాహనాల డ్రైవర్ లకు పోలిసుల హెచ్చరిక
- February 20, 2016
విపరీత శబ్దాలను కల్గించే కొందరు వాహనాల డ్రైవర్ లను ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. ప్రజలని ఇబ్బంది కల్గించే విధంగా బిగ్గరగా హారన్లు మోగించడం మానివేయని వారిపై ఇకపై క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని ట్రాఫిక్ జనెరల్ డైరక్టర్ షేక్ నసీర్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ ఖలీఫా శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రణగొణ ధ్వనులను కల్గిస్తూ ప్రజలను శబ్ద కాలుష్యానికి గురిచేసే వారిపై ఇటీవల 236 ఉల్లంఘన నేరాలు నమోదయినట్లు ఆయన తెలిపారు. ఈ తరహా పిర్యాదులు ఇటీవల తమకు ఎక్కువ అయినందున రద్దీగా ఉండే రహదారులపై ట్రాఫిక్ పోలీసుల గస్తీ ని ఎక్కువగా పెంచి బిగ్గరగా హారన్లు మోగించేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఏ వాహనదారుడైనా అనవసర శబ్దాలను కల్గించితే, తమకు పిర్యాదు చేయాలని ఆయన కోరారు. కొంతమంది డ్రైవర్ లు తమ సాధారణ కార్లకు రేసింగ్ కార్ల శబ్దాలు ఏర్పాటు చేసుకొంటున్నారని, అవి ఎక్కడ్నుంచో వేగంగా దూసుకువచ్చినట్లు వచ్చి కీచు మనే శబ్దంతో వెనుక ఆగినట్లుగా కృత్రిమ గోల కారణంగా ప్రజలు భయపడే విధంగా వింత ధ్వనులు పెడుతున్నారని చెబ్తూ...ఇకపై వారు తామే స్వచ్చంగా తొలగించుకోవాలని సూచించారు. ఈ దేశంలో ఈ తరహా ప్రయోగాలు చెల్లవని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







