ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవాళ్లకు కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదన్న యూఏఈ

- December 16, 2020 , by Maagulf
ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవాళ్లకు కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదన్న యూఏఈ

యూఏఈ:కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ అవసరం లేదని యూఏఈ స్పష్టం చేసింది. సమర్ధవంతమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారికి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవశ్యతకత లేదని వివరించింది. మైనర్ ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు, వైరస్ తాలుకు దుష్ఫ్రభావాలు లేని వారికి అదనంగా రోగ నిరోధక శక్తి బహర్గత మద్దతు అవసరం లేదని స్పష్టం చేసింది. అలాంటి వారికి నిపుణుల సూచనల మేరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక అంటు వ్యాధుల ప్రభావంతో వాటి లక్షణాలు స్పష్టం కనిపించిన పక్షంలో వారికి ఇమ్యూనిటీ సామర్ధ్యాన్ని పెంచేలా బహర్గత మద్దతు అవసరం అని వివరించింది. వ్యాక్సిన్ ఎవరి అవసరమో...ఎవరికి కాదో నిర్దారించేందుకు ఇమ్యూనిటీ స్థాయి తెలిపే పరీక్షలు నిర్వహిస్తామని, ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే వారికి వ్యాక్సిన్ అవసరం ఉండదని వెల్లడించింది. అయితే..ఒకవేళ యాంటీబాడిలో ఏర్పడటంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే మాత్రం వారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని యూఏఈ స్పష్టత ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com