'రౌడీ బేబీ' సినిమా షూటింగ్ ప్రారంభం

- December 16, 2020 , by Maagulf
\'రౌడీ బేబీ\' సినిమా షూటింగ్ ప్రారంభం

విశాఖపట్నం:పరిపాలనా రాజధాని గా రూపాంతరం చెందిన విశాఖ నగరంలో  చలన చిత్ర పరిశ్రమకు  వనరుల కొరత లేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. లోకల్ టాలెంటెడ్ యువతకు ఊతమిస్తూ,  విశాఖ నగరం లో నిర్మిస్తున్న రౌడీ బేబీ చలన చిత్ర ముహూర్తపు షాట్ ప్రారంభోత్సవం లో ఆయన మాట్లాడారు. తాను నిర్మాత గా , జి. నాగేశ్వర రెడ్డి డైరెక్టర్ గా  తెరకెక్కించబోతున్న ఈ చిత్రం లో సందీప్ కిషన్ , నేహా శెట్టి తారాగణం గా ఉన్నారన్నారు. 

కోన వెంకట్ సారధ్యం లో  నిర్మిత మయ్యే ఈ చిత్రం  షూటింగ్ ను పూర్తిగా  విశాఖ లో చేస్తున్నామన్నారు. ఒక్క సీన్ కూడా విశాఖ ను దాటి తాము తీయడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గతంలో చలన చిత్ర పరిశ్రమకు విశాఖ అనుకూలమన్న విషయాన్ని ప్రస్తుతించామన్నారని, ఇదే విసహాయాన్ని తాజాగా రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తానే ఓ అడుగు ముందుకు వేసి రౌడీ బేబీ చిత్రాన్ని నిర్మిస్తున్నానని అన్నారు. పూర్తి హాస్య భరిత కధాంశం గా సాగే ఈ చిత్రం అందరి ఆదరాభి మానాలు పొందుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.  ఈ క్రమంలో  ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ , హీరో హీరోయిన్ లతో ప్రారంభ షూట్ ను ఎంపీ తొలి షాట్ కొట్టి ప్రారంభించారు. అసభ్యతకు తావులేకుండా ఆద్యంతం ఈ చిత్రం కొనసాగుతుందన్నారు. ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి అవుతుందని, మార్చి , ఏప్రిల్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుందని అన్నారు. 
తదుపరి మే నెలలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

కరణం ధర్మశ్రీ  పోలీసు  కమిషనర్ గా, గొల్ల  బాబూరావు  తండ్రి పాత్రలో అలరించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్,  కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి,  అమర్ నాథ్, వాసుపల్లి గణేశ్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజ్, తైనాల విజయ్ కుమార్, జీ వెంకటేశ్వరరావు( సహ నిర్మాత) తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com