భారత్ లో కొత్తగా 24,010 కరోనా కేసులు..
- December 17, 2020
న్యూ ఢిల్లీ:తాజాగా నమోదైన గణాంకాలు గమనిస్తే దేశంలో కరోనా తీవ్రత తగ్గినట్లే అనిపిస్తుంది. బుధవారం 11,58,960 కరోనా టెస్టులు చేయగా.. 24,010 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 99,56,558కి చేరింది. కొత్తగా మరో 355 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,44,451కు చేరింది. వరసగా గత ఐదురోజులుగా కరోనా మరణాలు 400 దిగువనే నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,22,366 యాక్టీవ్ కేసులున్నాయి. దేశంలో యాక్టీవ్ కేసుల 3.24 ఉండగా..రికవరీ రేటు 95 శాతం పైనే కొనసాగుతోంది. బుధవారం వ్యాధి బారి నుంచి 33,291 మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 94,89,740కు చేరింది.
కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







