డిజిటల్‌ అక్షరాస్యత: టాప్‌ టెన్‌లో సౌదీ అరేబియా

- December 18, 2020 , by Maagulf
డిజిటల్‌ అక్షరాస్యత: టాప్‌ టెన్‌లో సౌదీ అరేబియా

రియాద్:డిజిటల్‌ లిటరసీ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా గణాంకాల్ని చూస్తే, టాప్‌ 10లో సౌదీ అరేబియాకి చోటు దక్కింది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 సంవత్సరానికిగాను టాప్‌ టెన్‌ లిస్ట్‌లో సౌదీ అరేబియా చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా పాండమిక్‌ నేపథ్యంలో పలు కీలక అంశాల ప్రాతిపదికన ఈ లిస్ట్‌ తయారు చేశారు. అడాప్షన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫ్లెక్సిబిల్‌ వర్క్‌ అరేంజ్‌మెంట్స్‌, నేషనల్‌ డిజిటల్‌ స్కిల్స్‌ అలాగే డిజిటల్‌ లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ వంటి అంశాల్లో చూపిన ప్రతిభకు ఇది సరైన గౌరవం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టెక్నాలజీ విభాగంలో విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ నుంచి అవార్డ్‌ గెలుచుకుంది సౌదీ అరేబియా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com