చుండ్రు తగ్గాలంటే...
- December 19, 2020
చాలా మందిని వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి. కొందరిలో జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లబడటం లాంటి సమస్యలతోపాటు చుండ్రు కూడా ఇబ్బందికి గురి చేస్తుంది. తలపై చుండ్రు పేరుకుపోవడం వల్ల చిరాకు కలుగుతుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు పాటించాల్సిన చిట్కాలు..
- రాత్రి పూట మెంతుల్ని నీటిలో నానబెట్టి తెల్లవారాక రుబ్బి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఓ గంటసేపు ఆగి షాంపూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా మాడు కూడా చల్లబడుతుంది.
- వేప నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమాన మోతాదులో కలిపి వేడి చేయాలి. ఆ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెంటుకలకు, మాడుకు రాసుకోవాలి. అలా ఉంచాక పావుగంట ఆగి షాంపూ చేసుకోవాలి.
- చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి నువ్వల నూనెలో వేయాలి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయానే షాంపూ చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
- కలబంద గుజ్జును మాడుకు పట్టించి పావుగంట తర్వాత షాంపూ చేయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా వెంట్రుకలు మృదువుగా మారతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







