వంశీ గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కాబోతున్న బాపు పాటకు పట్టాభిషేకం
- December 19, 2020
3వ ప్రపంచ సంగీత, సాహిత్య సమ్మేళనం సందర్భంగా పద్మశ్రీ పురస్కారగ్రహీత ప్రముఖ చిత్రకారులు, ప్రముఖ సినీదర్శకులు, రచయిత బాపు 87వ జయంతిని వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, వేగేశ్న ఫౌండేషన్ ఇండియా, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు అంటే నిర్విరామంగా 12 గంటలపాటు నిర్వహించనున్నారు. 5 ఖండాలలోని 10 దేశాలలోని 50మంది గాయనీ గాయకులు బాపు దర్శకత్వం వహించిన చిత్రాలనుంచి 130 ఆణిముత్యాలవంటి పాటలతో బాపు పాటకు పట్టాభిషేకం చేయనున్నారు. భారతదేశం నుంచి మిత్ర, కె. వెంకట్రావు, రాజేంద్రప్రసాద్, సిహెచ్. త్రినాథరావు, శరత్‌బాబు కాజా, సుభాష్, బాపిరాజు, ధనంజయ్, సురేఖామూర్తి దివాకర్ల, శశికళాస్వామి వేదాల, విన్నకోట దుర్గ, శారదా సాయి, బి.వి.ఎల్.ఎన్ పద్మావతి, అఖిల, ఆమని, చిత్తరువు లక్ష్మీపద్మజ, బి.వి. నాగలక్ష్మి, నాగేశ్వరి రూపాకుల, హిమబిందు, లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు, అనఘదత్త రామరాజు తమ గానం వినిపిస్తారు. అలాగే అమెరికా నుంచి జి.వి. ప్రభాకర్, శ్రీనివాస భరద్వాజ కిశోర్, రాధికానోరి, కుమార్ రాణి, లలితారాణి, డా.శాంతి ఇప్పనపల్లి, మాధురీ కృష్ణ పాటిబండ, లావణ్య కూచిభొట్ల, మానస హరి దేవరకొండ, సంతోష్ దేవరకొండ, తేజస్విని పోలా; సింగపూర్ నుంచి సౌభాగ్యలక్ష్మి తంగిరాల, అనంత్ బొమ్మకంటి, కె.ఎస్. రావు; న్యూజీలాండ్ నుంచి శ్రీనివాసరావు నందగిరి, శ్రీసుత నాంపల్లి; ఆస్ట్రేలియా నుంచి రమా కంచిభొట్ట, ఉష చివుకుల, ప్రియాంక మార్గాని; హాంగ్‌కాంగ్ నుంచి రూపాశాస్త్రి; సిడ్నీ నుంచి ఆదిత్య వెనిచెర్ల, మనోహర్ యల్లావఝల; సౌత్ ఆఫ్రికా నుంచి కీర్తికా మంగు; మలేషియా నుంచి వనిత, డా.ఈశ్వర్, రాకేష్, క్రిషా, దర్నీషా; స్వీడన్ నుంచి విష్ణుప్రియ; లండన్ నుంచి శశికళ తమ గానం వినిపిస్తారని కార్యక్రమ సమన్వయకర్తలు అమెరికా గానకోకిల శారద ఆకునూరి, డా.వంశీ రామరాజు తెలియజేశారు.
డా.కె.వి. రమణ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో సినీ మరియు విదేశీ ప్రముఖులు తమ సందేశాలు ఇవ్వనున్నారు. తానా, ఆటా, నాట్స్, టాటా, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్యవేదిక, తెలుగు మల్లి.కామ్, న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య, మలేషియా తెలుగు సంఘం, తెలుగు సాంస్కృతిక నిలయం - మార్షియస్, శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్; ఆస్ట్రేలియా తెలుగు సంఘం సహకారం అందిస్తున్న ఈ కార్యక్రమం వంశీ గ్లోబల్ అవార్డ్స్ వారి వంశీ గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కాబోతున్నది.

తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









