సిఐడి, సిసిపిడబ్ల్యుసి ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
- December 21, 2020
అమరావతి:సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో సిబ్బందికి మెరుగైన శిక్షణ కోసం వర్చువల్ ద్వారా అనంతపురం CCPWC(Cybercrime Prevention against Women and Childre) ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎపి డిజిపి
మంగళగిరి డీజీపీ కార్యాలయంలో సిఐడి ఎ.డి.జి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురంలో నూతన CCPWC ట్రైనింగ్ సెంటర్ ను వర్చువల్ పద్ధతి ద్వారా ప్రాంభించిన ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్.
ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ నేరస్తులను పట్టుకోవడానికి, నేరాలను అదుపు చేయడానికి అదునాతనమైన టెక్నాలజీని వినియోగంపై శిక్షణ కార్యాలయాన్ని ప్రారంభించటం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఇదొక శుభసూచకం అని పేర్కొన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ పౌరులకు అందుబాటులోకి తీసుకొని వచ్చిన పోలీస్ ఆప్ ద్వారా 80కి పైగా సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను అందిస్తామన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా పోలీస్ సిబ్బందికి ఆధునిక టెక్నాలజీ వినియోగంలో పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా నేరాలను గుర్తించడం కేసు దర్యాప్తులో ఎంతగానో సులభతరం అవుతుందన్నారు. పోలీస్ శాఖ లోని సిబ్బంది శిక్షణ కోసం విధమైన ట్రైనింగ్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకోవచ్చిన ఎపి పోలీస్(సీఐడీ విభాగం) అధికారులను గౌతం సవాంగ్ IPS అభినందించారు.
ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్(ఏపి సిఐడి), సి.హెచ్ ద్వారకా తిరుమల రావు(ఎడిషనల్ డిజిపి- రైల్వేస్), రవి శంకర్(అడిషనల్ డిజిపి లా అండ్ ఆర్డర్), బాల సుబ్రహ్మణ్యం(అడిషనల్ డిజిపి), సునీల్ కుమార్ నాయక్ (రాయలసీమ), హరి కృష్ణ , హరి కుమార్(ఐపిఎస్ రిటైర్డ్), మురళీకృష్ణ (ఐపిఎస్ రిటైర్డ్), నాగేంద్ర కుమార్ మరియు అనంతపూర్ ఎస్ పి ఏసు బాబు ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు