CBSE పరీక్షలు వాయిదా

- December 22, 2020 , by Maagulf
CBSE పరీక్షలు వాయిదా

న్యూ ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు 2021 ఫిబ్రవరి వరకు జరగవని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఇవాళ( మంగళవారం) ఉపాధ్యాయులతో జరిగిన వర్చువల్ మీటింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించలేమని..ఆ తరువాత జరుగుతాయన్నారు. అయితే ఎగ్జామ్స్ ఎప్పడనేది త్వరలోనే చెబుతామన్నారు. చాలా స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని.. కాబట్టి బోర్డు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగవన్నారు. సీబీఎస్ఈ మొత్తం సిలబస్ లో 30 శాతం వరకు తగ్గించారు. తగ్గించిన సిలబస్ తోనే ఎగ్జామ్స్ జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com