విమానాల రద్దుతో రీ-బుకింగ్‌ రిక్వెస్టుల వెల్లువ

- December 23, 2020 , by Maagulf
విమానాల రద్దుతో రీ-బుకింగ్‌ రిక్వెస్టుల వెల్లువ

మస్కట్‌:ఒమన్‌లోని ట్రావెల్‌ ఏజెన్సీస్‌, ప్రయాణీకుల తాకిడికి గురవుతున్నారు. యూరోపియన్‌ దేశాల్లో కోవిడ్‌ 19 కొత్త స్ట్రెయిన్‌ వెలుగు చూసిన దరిమిలా, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణీకులు, రీ-బుకింగ్స్‌ కోసం ట్రావెల్‌ ఎజెన్సీలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు టెలిఫోన్‌ ద్వారా, ఇంకో వైపు ప్రత్యక్షంగా వస్తున్నవారికి సమాధానం చెప్పలేక ట్రావెల్‌ ఏజెన్సీలు సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఒకేసారి 50 మంది వరకు కార్యాలయానికి వచ్చారనీ, వారందరికీ శరీర ఉష్ణోగ్రత టెస్టులు చేస్తున్నామనీ, కరోనా నిబంధనల నేపథ్యంలో వారిని కంట్రోల్‌ చేయడం కష్టంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. అత్యవసర పని మీద ఇండియాకి వెళ్ళిన ఓ వ్యక్తి తిరుగు ప్రయాణానికి సమస్యలు వచ్చాయని మరో ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకులు వెల్లడించారు. చాలామంది వినియోగదారులు, తమ డబ్బుల్ని తిరిగిచ్చేయాలని కోరుతున్నారు.  

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com