యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన RBI

- December 23, 2020 , by Maagulf
యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన RBI

ముంబై:లోన్ యాప్‌ లు, వాటి వేధింపులకు సంబంధించి నమోదైన కేసుల అంశంలో ఆర్బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని యాప్‌లు అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్లు తెలిసింది అని ఆర్బీఐ పేర్కొంది. సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంటూ ఆర్బీఐ సీజీఎం యోగేష్ దయాల్ ఒక లేఖ రిలీజ్ చేశారు. యాప్ మోసాలపై http://sachet.rbi.org.in వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సీపీ అంజనీ కుమార్ కూడా ఆన్లైన్ లోన్స్ కు ఆర్బిఐ నుండి ఎలాంటి అనుమతులు లేవని ఆన్లైన్ లోన్ అప్లై చేసుకుని ఇబ్బందులు తెచ్చుకోవద్దని కోరారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు. ఇక ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని అన్నారు. వారి పై ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని అన్నారు. హైదరబాధ్ లో ఇప్పటి వరకు 22 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశామని పేర్కొన్న ఆయన నిన్న బెంగుళూర్ లో ఆన్లైన్ లోన్ యాప్ కార్యాలయాల పై సీఐ డి దాడులు చేసిందని ఎన్ బి ఎఫ్ సి ఉన్న లోన్ సంస్థలను మాత్రమే ప్రజలు నమ్మండని ఆయన కోరారు. ఆన్లైన్ లోన్ యాప్ లను ఎవరు కూడా నమొద్దని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com