యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన RBI
- December 23, 2020
ముంబై:లోన్ యాప్ లు, వాటి వేధింపులకు సంబంధించి నమోదైన కేసుల అంశంలో ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ, ఎన్బీఎఫ్సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని యాప్‌లు అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్లు తెలిసింది అని ఆర్బీఐ పేర్కొంది. సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంటూ ఆర్బీఐ సీజీఎం యోగేష్ దయాల్ ఒక లేఖ రిలీజ్ చేశారు. యాప్ మోసాలపై http://sachet.rbi.org.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇక ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సీపీ అంజనీ కుమార్ కూడా ఆన్లైన్ లోన్స్ కు ఆర్బిఐ నుండి ఎలాంటి అనుమతులు లేవని ఆన్లైన్ లోన్ అప్లై చేసుకుని ఇబ్బందులు తెచ్చుకోవద్దని కోరారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు. ఇక ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని అన్నారు. వారి పై ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని అన్నారు. హైదరబాధ్ లో ఇప్పటి వరకు 22 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశామని పేర్కొన్న ఆయన నిన్న బెంగుళూర్ లో ఆన్లైన్ లోన్ యాప్ కార్యాలయాల పై సీఐ డి దాడులు చేసిందని ఎన్ బి ఎఫ్ సి ఉన్న లోన్ సంస్థలను మాత్రమే ప్రజలు నమ్మండని ఆయన కోరారు. ఆన్లైన్ లోన్ యాప్ లను ఎవరు కూడా నమొద్దని ఆయన కోరారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







