'ఆహా'లో 52 ప్రీమియం ఒరిజినల్స్..2021 దీపావళి వరకు అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

- December 24, 2020 , by Maagulf
\'ఆహా\'లో 52 ప్రీమియం ఒరిజినల్స్..2021 దీపావళి వరకు అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'ఆహా' ఈ ఏడాది నవంబర్‌లో దీపావళి రోజున గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ ఏడాది దీపావళి నుండి 2021 దీపావళి వరకు  52 ఒరిజినల్స్‌తో అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి సిద్ధమవుతుంది. ఈ ఒరిజినల్స్‌ను తెలుగు ఇండస్ట్రీలోని టాప్‌ ఫిలిం మేకర్స్‌ రూపొందిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ మూవీ, వెబ్‌ సిరీస్‌, టాక్‌ షోస్‌, డ్రామాస్‌ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జోనర్స్‌ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు. హ్యూజ్‌ కంటెంట్‌తో దేశంలోని అత్యంత వినూత్నమైన, విభిన్నమైన తెలుగు కంటెంట్ లైబ్రరీలలో ఒకదానిగా ఉండటానికి ఆహా ప్రయత్నిస్తుంది.  ప్రస్తుతం 7 mn యాప్ డౌన్‌లోడ్‌లతో ఉన్న ఆహా ఇప్పుడు 20 మిలియన్లకు పైగా ఉన్నతన బలమైన వినియోగదారులకు సేవలు అందిస్తుంది. 

తమ కంటెంట్‌ విస్తృతిని పెంచుకోవడానికి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆహా ప్రతినిధులు అనౌన్స్‌ చేశారు. తిరుగులేని కంటెంట్‌ కోసం ప్రముఖ దర్శకులైన సుకుమార్‌, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశి పైడిపల్లి, నందిని రెడ్డి, ప్రవీణ సత్తారు, డాక్టర్ సైలేష్, పవన్ కుమార్, వేణు ఉడుగుల, సుధీర్ వర్మ, సాగర్ చంద్ర రంగా యాలి, విద్యా సాగర్, ఉదయ్ గుర్రాలా, ప్రణవ్ పింగిల్ రెడ్డి, పల్లవి గంగిరెడ్డి తదితరులతో పాటు అద్భుతమైన యాక్టర్స్‌తో కలిసి పని చేస్తున్నారు. రీసెంట్‌గా స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేనితో వ్యాఖ్యాతగా సామ్‌ జామ్‌ అనే టాక్‌షోను ప్రారంభించారు. వెబ్‌ సిరీస్‌ పర్మనెంట్‌ రూమ్మేట్స్‌తో పాటు  కమిట్‌మెంటల్‌, మావింతగాధవినుమా, అనగనగా ఓ అతిథిలతో ఆహా ప్రేక్షకులను ఈ ఎంటర్‌టైన్‌ చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. 

మరో స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా నటించిన లెవన్త్‌ అవర్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా తమన్నా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. అలాగే  స్వప్న దత్‌ రూపొందిస్తున్న కంబలపల్లి కథలు, బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియావారి అన్య ట్యుటోరియల్, సూపర్ ఓవర్, మైదానం, మేజ్, బియాండ్ టెక్స్ట్ బుక్, కుడి యేడమైతే, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, తోడేలు, రుద్రవీణ మరియు కుబూల్ హై వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. 

ఈ సందర్భంగా ఆహా ప్రమోటర్‌ జూపల్లి రామురావ్‌ మాట్లాడుతూ "ఈ రోజు ఓటీటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. పీడబ్ల్యుసీ నివేదిక ప్రకారం వచ్చే నాలుగేళ్ళలో 28.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 50 మిలియన్లకు పైగా తెలుగు కంటెంట్ వినియోగదారులతో, మార్కెట్ సామర్థ్యం భారీగా ఉందని మేము నమ్ముతున్నాం. ఈ నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే ఆహా మాధ్యమం తెలుగు వినోద పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా గుర్తింపు పొందింది. ఇంకా ప్రముఖ దర్శకులు, ఆర్టిస్టులు కాంబినేషన్‌లో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి ఆహా చేసే ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుందని మేం నమ్ముతున్నాం" అన్నారు. 

ఓటీటీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ఆహా ఇండియాలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రానున్న ఏడాది మరింత ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతుంది ఆహా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com