ట్రెయిన్ హోస్టెస్‌లు త్వరలో రానున్నారు
- February 21, 2016
విమానాల్లో లాగే త్వరలో రైలు ప్రయాణికుల కోసం ట్రెయిన్ హోస్టెస్‌లు రానున్నారు. దేశంలో దిల్లీ- ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ట్రెయిన్ హోస్టెస్‌ల ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ రైల్లో హై-పవర్ అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారం, స్లైడింగ్ ద్వారాలతో పాటు లైవ్ టీవీ సౌకర్యం ఉంది. విమాన సర్వీసుల్లాగే గతిమాన్ రైల్లో క్యాటరింగ్ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విశేషాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వచ్చే రైల్ బడ్జెట్‌లో ప్రకటించనున్నారు.టికెట్ ధర శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ధర కంటే 25 శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాటరింగ్‌లో భారతీయ, విదేశీ వంటకాలు ఉంటాయి. ఇలాంటి రైళ్లను కాన్పూర్-దిల్లీ, ఛండీగడ్-దిల్లీ,హైదరాబాద్-చెన్నై, నాగ్‌పూర్-బిలాస్‌పూర్, గోవా-ముంబయి, నాగ్‌పూర్-సికింద్రాబాద్‌ల మధ్య కూడా నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







