హను రాఘవపూడితో ఎన్టీఆర్ సినిమా
- February 21, 2016
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రెండో సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ డైరెక్టర్ తో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంతో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమా పూర్తయిన తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడట.అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను, ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని తన మార్క్ చూపిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







