ఇరాన్‌లో 10 మంది పర్వాతారోహకులు మృతి
- December 27, 2020
తెహ్రాన్:ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో సుమారు 10 మంది పర్వాతారోహకులు మృతి చెందారు. భారీ హిమపాతం కారణంగా వీరు మరణించారని స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరాన్‌లోని పలు ప్రాంతాలు భారీ హిమపాతంతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అనేక రహదారులను మూసివేశారు. తెహ్రాన్‌లోని ఆల్‌బోర్జ్ పర్వతాన్ని ఎక్కేందుకు వచ్చిన తొమ్మిది మంది భారీ హిమపాతంలో చిక్కుకుపోయి చనిపోగా..మరొకరిని రక్షించినప్పటికీ..చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







