కరోనా కొత్త స్ట్రెయిన్‌..WHO చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

- December 27, 2020 , by Maagulf
కరోనా కొత్త స్ట్రెయిన్‌..WHO చీఫ్  స్ట్రాంగ్ వార్నింగ్

జెనీవా:కరోనా వైరస్ చివరి మహమ్మారి కాదని… వాతావరణ మార్పులను మరియు జంతు సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఉంటే ఇలాంటివి మరిన్ని వచ్చే అవకాశం ఉందని, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచకుండా ఇలాగే ఉంటే… మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని… ప్రపంచ ఆరోగ్య సంస్థల చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఇది చివరి మహమ్మారి కాదని చరిత్ర చెబుతుందని ఆయన అన్నారు.

అంటువ్యాధులు జీవితం అనేది అంతరించిపోయే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు. మహమ్మారి మానవులు, జంతువులు మరియు గ్రహం యొక్క ఆరోగ్యానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను హైలైట్ చేసింది అని ఆయన వెల్లడించారు. మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చేస్తున్న ఏ ప్రయత్నాలు అయినా విచారకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

గత 12 నెలల్లో, మన ప్రపంచం తలక్రిందులైంది అని అన్నారు. మహమ్మారి ద్వారా వచ్చే ప్రభావాలు వ్యాధికి మించినవి అని ఆయన అన్నారు. ఆర్ధిక వ్యవస్థ అనేది చాలా నాశనం అయిపోయిందని ఆయన వెల్లడించారు. కాగా అంటువ్యాధులను ఎదుర్కోవడంలో నివారణ, సంసిద్ధత మరియు భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com