ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే....

- December 27, 2020 , by Maagulf
ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే....

కోవిడ్ ‌ను ఎదుర్కోవాలంటే..రోగ నిరోధక శక్తి పెరగాలి. అదే ఇమ్యూనిటీ పవర్. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం తినాలి..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఎవరి నోట విన్నా ఇదే మాట. పంజా విసురుతున్న కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్యులు. దీంతో జనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెడుతున్నారు.

రోజుకో రకం రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కోవిడ్‌ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మాయదారి మహమ్మారి కోవిడ్ రోగ నిరోధక శక్తి లేని బాధితుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. కోవిడ్ ను నయం చేసేందుకు ఇప్పటి వరకూ మందులేదు. కోవిడ్ ను ఎదుర్కోవాలంటే మాస్క్ లు, శానిటైజర్లు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం తప్పా..మరో మార్గం లేదు. ఇవ్వన్నీ పాటిస్తున్నా రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది.కోవిడ్ ను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం ఏవేవి తీసుకోవాలనేదానిపై ఇప్పుడు అందరిలోనూ శ్రద్ధ పెరిగింది. దీంతో న్యూట్రిషియన్లు, వైద్యులు, మెడికల్ స్టోర్స్ దగ్గర జనం ఎంక్వైరీలు మొదలు పెట్టారు. కోవిడ్ అంటకుండా జాగ్రత్తలు పడుతూనే, అది సోకినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఇమ్యూనిటీ పెంచుకునే పనిలోపడ్డారు. దీని కోసం ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతిపైనా ఆధారపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com