దుబాయ్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు..ఉల్లంఘిస్తే Dh50,000 ఫైన్

- December 27, 2020 , by Maagulf
దుబాయ్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు..ఉల్లంఘిస్తే Dh50,000 ఫైన్

దుబాయ్:కోవిడ్ రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో దుబాయ్ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించింది. ప్రైవేట్ పార్టీలు, న్యూ ఇయర్ వేడుకల్లో 30 మందికి మించి పాల్గొనేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పరిమిత సంఖ్యకు మించి జరుపుకునే సెలబ్రేషన్స్ కు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి ఇచ్చేది లేదని కూడా తేల్చి చెప్పింది. అంతేకాదు..30 మంది లోపు హజరయ్యే వేడుకల్లోనూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ప్రతీ వ్యక్తికి మీటర్ దూరం ఎడం ఉండాలని దుబాయ్ సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పార్టీలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని కమిటీ సూచించింది. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపింది. ఎవరైనా సుప్రీం కమిటీ సూచనలను పాటించకపోతే వేడుక నిర్వాహకులకు Dh50,000, వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి Dh 15,000 చొప్పున ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com