అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సాయం అందించిన 'గల్ఫ్ జనసేన'
- December 27, 2020
బహ్రెయిన్: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం మండలం, ముంజవరపుకోట్టు గ్రామం అడ్డపుంత లో నివసిస్తున్న దిగుమర్తి సరస్వతి అనే యువతి గత కొంతకాలం గా కడుపులో గడ్డలతో బాధపడుతోంది. చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఆమె కష్టాలను పలువురు ఎన్నారై జనసేన నాయకులకు తెలియజేయగా గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ) కు చెందిన గల్ఫ్ జనసేన ఎన్ఆర్ఐ ఉద్యోగులు అంతా కలిసి సరస్వతి చికిత్సకు కావలసిన కొద్ది మొత్తాన్ని సమకూర్చారు.
డబ్బులను మండల జనసేన నాయకులు చేతుల మీద ఆ కుటుంబానికి చేర్చారు గల్ఫ్ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండలం జనసేన నాయకులైన కుంపట్ల నరసింహారావు సూర్య మోహన్ రావు విజయ్ గోపాల్ , భూసయ్యకాపు, శ్రీను , ఆకుల వెంకటరంగారావు , బిక్కిన సూర్యనారాయణమూర్తి , స్వామి నాయుడు, వాసంశెట్టి కుమార్ శ్రీనివాసరావు, వెంకటేష్ శృంగవరపు, లక్ష్మణ రావు పేరాబత్తుల, సూర్య ముకుంద్, దైవాల రాంబాబు పాటి సత్తిబాబు , గుత్తుల రాంబాబు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







