ఏడాది ముగిసేలోపు రెసిడెన్సీ వీసా రెన్యువల్ చేయించుకోవాలి
- December 28, 2020
కువైట్: రెసిడెన్సీ వీసా గడువు తీరుతున్నవారు, వాటిని వీలైనంత త్వరగా రెన్యువల్ చేయించుకోవాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) సూచించింది. గురువారం లోపే తమ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకోవాలనీ, రెండు వారాల పాటు ఈ సర్వీసుని సస్పెండ్ చేయనున్నారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి 12 వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, రెన్యువల్స్ని రద్దు చేయనుంది. ఆయా వ్యవహారాలు సజావుగా నడిచేందుకోసం జనవరి 12న ఆన్లైన్ సిస్టమ్ ప్రారంభించబడుతుంది. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం అంత శ్రేయస్కరం కాదు గనుక, ఈ కోణంలో ఆన్లైన్ రెన్యువల్స్ని అందుబాటులోకి తెస్తున్నారు. కాగా, ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా రెండు కొత్త సర్వీసుల్ని లాంచ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ల తాలూకు డిజిటల్ కాపీల ప్రాసెసింగ్ వంటివి ఇందులో వున్నాయి. సేవల తాత్కాలిక సస్పెన్షన్ నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ ఎదురుకాకూడదంటే, ఈ వారాంతంలోపు రెన్యువల్స్ చేయించుకోవాల్సి వుంటంఉది.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









