'సోగ్గాడే చిన్నినాయనా' విడుదల తేదీకి 'బంగార్రాజు' ముహూర్తం!
- December 28, 2020
కింగ్ నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా (2016). నాగ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. కాగా, 'బంగార్రాజు' పేరుతో త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది. 'సోగ్గాడే..'లో బంగార్రాజు పాత్రకి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఇందులోనూ నటిస్తారని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ పాటికే మొదలు కావాల్సిన 'బంగార్రాజు' కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'సోగ్గాడే చిన్నినాయనా' విడుదల తేది అయిన జనవరి 15నే 'బంగార్రాజు'కి సంబంధించిన ముహూర్తంని ఫిక్స్ చేశారట. అలాగే జనవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి.. 'బంగార్రాజు'తో నాగ్, కళ్యాణ్ కృష్ణ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
'సోగ్గాడే చిన్ని నాయనా'కి సంగీతమందించిన అనూప్ రూబెన్స్.. 'బంగార్రాజు'కి కూడా బాణీలు అందిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు