క్రేజీ కాంబో..విజయ్ దేవరకొండ ను కలిసిన బిగ్ బాస్ విజేత అభిజీత్
- December 28, 2020
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఆ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. అందరు కొత్తవాళ్లతో సినిమా తీసిన శేఖర్ కమ్ముల ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్‌ను అందించారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన అభిజిత్ ప్రస్తుతం బిగ్‌బాస్-4 విన్నర్‌గా నిలిచారు. అంతేకాకుండా ఇందులో మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన రౌడిభాయ్ విజయ్ దేవరకొండ ఎంతపెద్ద స్టార్డమ్ సంపాదించారో అందరికి తెలుసు. అయితే బిగ్‌బాస్ విజయం సాధించిన అభిజిత్ వెనక చాలా మంది ప్రోత్సాహం ఉంది. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ, నాగబాబు, లైఫ్ఈజ్ బ్యూటీఫుల్ సినిమా టీం తదితరులు ఉన్నారు. వారందరిని కలుస్తూ అభిజిత్ ధన్యవాదాలు తెలుపుతున్నాడు. తాజాగా విజయ్‌ని కలవడానికి వెళ్లినపుడు అక్కడికి అభిజిత్‌తో పాటు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ టీం కూడా వచ్చింది. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలను సుధాకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు