హజ్ పోర్టల్, స్మార్ట్ కార్డ్ ప్రారంభం

- December 28, 2020 , by Maagulf
హజ్ పోర్టల్, స్మార్ట్ కార్డ్ ప్రారంభం

రియాద్: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రాహ్ శనివారం కొత్త వేదిక అలాగే స్మార్ట్ కార్డుని ఆయా ఆపరేషన్స్ అలాగే సర్వీసులకు మినిస్ట్రీ లోని అన్ని సెక్టార్లకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. ప్రతి పిలిగ్రిమ్ కోసం ఈ స్మార్ట్ ఐడీ కార్డుల్ని వేర్వేరుగా వినియోగిస్తారు. వ్యక్తగత, వైద్య సంబంధిత, నివాస సంబంధిత సమాచారం ఇందులో వుంటుంది. పవిత్ర ప్రదేశాలకు సంబంధించి పూర్తి సమాచారం పిలిగ్రిమ్స్ కోసం ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా లభ్యమవుతుంది. షార్ట్ రేంజ్ వైర్ లెస్ కనెక్టివిటీ ద్వారా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ విధానం ద్వారా ఈ సేవలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. విజన్ 2020కి సంబంధించి ఇదొక ప్రతిష్టాత్మక ఆవిష్కరణ. హజ్ సీజన్ 2021లో దీన్ని వినియోగిస్తారు. ప్రయోగాత్మకంగా దీన్ని 2019లో ఉపయోగించారు. 50,000 స్మార్ట్ కార్డులను వినియోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com