తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన కుమారుడి అరెస్ట్

- December 28, 2020 , by Maagulf
తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన కుమారుడి అరెస్ట్

కువైట్ సిటీ:తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత తల్లిదండ్రుల్లో తండ్రి వయసు 60 ఏళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ ద్వారా తన ఆవేదనను బాధిత తండ్రి వెల్లగక్కుకున్నారు. వెంటనే పోలీసులు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్ళి, అతని కుమారుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడైన కొడుకు, డ్రగ్స్ మత్తులో వున్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. నార్కోటిక్స్ కొనుగోలుకు తాను డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తన కుమారుడు దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com