దుబాయ్ లో కశ్మీరీ కుంకుమపువ్వు అమ్మకంపై ప్రధాని మోదీ ప్రశంసలు

- December 28, 2020 , by Maagulf
దుబాయ్ లో కశ్మీరీ కుంకుమపువ్వు అమ్మకంపై ప్రధాని మోదీ ప్రశంసలు

దుబాయ్:కశ్మీర్ గడ్డపై సేకరించిన కుంకుమపువ్వును దుబాయ్ లో అమ్మటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కశ్మీరీ భౌగోళిక గుర్తింపు ఉన్న కుంకుమపువ్వుకు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుండటం శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 8-9న దుబాయ్ లో జరిగిన యూఏఈ-ఇండియా ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్-2020 సమయంలో కశ్మీరీ కుంకుమపువ్వు దుబాయ్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్ లోని అల్ మయ గ్రూప్ కశ్మీర్ భౌగోళిక గుర్తింపుతో ప్రమోట్ చేస్తోంది. అయితే..రేడియో ద్వారా తన మదీలో మాటలను ప్రజలతో పంచుకునే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన దుబాయ్ కి కశ్మీరీ కుంకుమ పువ్వు ఎగుమతుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కశ్మీరీ భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్ పొందిన కుంకుమపువ్వును దుబాయ్ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తుండటం సంతోషించదగిన విషయమని, కశ్మీరీ  కుంకుమపువ్వును ఎగుమతులకు ఈ పరిణామం మరింత ప్రొత్సాహకరంగా మారనుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత దేశంలో సేకరించిన కుంకుపువ్వు విశిష్టమైనదని, ఔషధగుణాలు కలిగి ఉన్నదని మన్ కీ బాత్ లో మోదీ వివరించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించగలిగిందని అన్నారు. ఇదిలాఉంటే..ప్రధాని దుబాయ్ లో కశ్మీరీ కుంకుమపువ్వు అమ్మకాలను ప్రస్తావించటం తమకు గర్వంగా ఉందని అల్ మయ గ్రూప్ డైరెక్టర్ కమల్ వచని సంతోషం వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com