జ్యుడిషియల్,లీగల్ స్టడీస్ కోసం వెబ్ సైట్ లాంచ్ చేసిన కువైట్ న్యాయ శాఖ

- December 28, 2020 , by Maagulf
జ్యుడిషియల్,లీగల్ స్టడీస్ కోసం వెబ్ సైట్ లాంచ్ చేసిన కువైట్ న్యాయ శాఖ

కువైట్ సిటీ:జ్యుడిషియల్, లీగల్ స్టడీస్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను లాంచ్ చేసింది కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ. కొన్ని సవరణలు, అవసరమైన మార్పులతో కొత్త వెబ్ సైట్(https://www.moj.gov.kw/) ను రూపొందించనట్లు మినిస్ట్రి ఆఫ్ జస్టిస్ అధికార ప్రతినిధి ఇస్సా అల్ బిషిర్ వెల్లడించారు. న్యాయపరమైన అంశాలపై అవగాహన పెంచుకునే వారికి, న్యాయ పరిశోధనలు చేసే వారికి న్యాయ శాఖ వెబ్ సైట్ సరైన వేదికని ఆయన అభిప్రాయపడ్డారు. వెబ్ సైట్లో న్యూస్, పలు అధ్యయనాలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాయని వివరించారు. అంతేకాదు..చట్ట, న్యాయపరమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి, రీసెర్చర్స్, స్కాలర్స్ కు వెబ్ సైట్ ఓ వారధిగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భౌతిక దూరం పాటిస్తూనే తమకు కావాల్సిన అంశాలను తెల్సుకునేందుకు, అధ్యయనం చేసేందుకు తమ అభిరుచులతో సరిపోలే వ్యక్తులతో న్యాయపరమైన అంశాలను పంచుకునేందుకు వెబ్ సైట్ చక్కటి వేదికగా మారుతుందని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com