కరోనా కొత్త స్ట్రైన్ తో ఆందోళన అవసరం లేదు:టి.గవర్నర్ తమిళి సై
- December 28, 2020
హైదరాబాద్:కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ముందంజలో ఉండటం గర్వకారణమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు.భారత్ బయోటెక్‌ను సందర్శించి ప్రధాని మోదీ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఉత్తేజం నింపారని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో వ్యవహరించాలని సూచించారు. వ్యాక్సిన్ తయారీకి రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. కరోనాపై పలువురు నెటిజన్లు ట్విటర్‌లో అడిగి ప్రశ్నలకు సోమవారం ఆమె సమాధానం ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!