‘మయూరి’ సుధకు ‘లెజెండ్’ అవార్డ్
- December 29, 2020
భారతీయ నృత్యంలో మయూరి సుధాచంద్రన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. యాక్సిడెంట్‌లో కాలు పోగా.. కృత్రిమ కాలు పెట్టుకొని నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయానికి గురిచేసిన గొప్ప నృత్య కళాకారిణి సుధాచంద్రన్. వెండితెరపై ఆమె జీవితం ఆవిష్కృతమైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడామె బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుతున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన సుధాచంద్రన్‌ను ఇప్పుడు ‘లెజెండ్‘ అవార్డ్ వరించింది.
వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బుల్లితెర అవార్డ్స్- 2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొప్పన కృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27న హైదరాబాద్ శిల్పారామం, రాక్ హైట్స్‌లో ఈ వేడుకలు నిర్వహించబడినాయి. బుల్లితెర కళాకారుల ప్రతిభకు తగినట్లుగా ఈ వేడుకలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందచేశారు. ఇక నాట్యమయూరి సుధాచంద్రన్‌ను ఈ వేదికపై ‘లెజెండ్’ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును జీవితా రాజశేఖర్, బాబుమోహన్, శివాజీరాజా, అంజికా కృష్ణలు.. సుధాచంద్రన్‌కు అందజేశారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసి.. ఘనంగా సత్కరించిన వారందరికీ సుధాచంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. పలు సీరియల్స్‌లో ఉత్తమ నటనను కనబరిచిన నటీనటులను ఈ అవార్డులు వరించాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







