అమెరికా లో టీఆర్‌ఎస్ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి మృతి
- December 29, 2020
న్యూ జెర్సీ: అమెరికా న్యూజెర్సీలో టీఆర్‌ఎస్ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి మృతి చెందారు. తన పని ముగించుకొని మెయిల్ బాక్స్‌లో ఉన్న లెటర్స్ తీసుకునేందుకు బయటికొచ్చిన దేవేందర్.. కారులో కూర్చొని ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేందర్ మృతి చెందారు. దేవేందర్..భార్య, ఏడేళ్ల కూతురితో కలిసి న్యూజెర్సీలో నివాసముంటున్నారు.
దేవేందర్‌రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. దేవేందర్ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. దేవేందర్ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోని బ్యాటరీ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందా..? లేక ఇంకేదైనా కారణముందా..? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
మరోవైపు దేవేందర్ మృతితో అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా షాక్‌కు గురయ్యారు. దేవేందర్ హఠాన్మారణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు