‘ఆహా’ ఒరిజినల్‌గా సంక్రాంతి కి 'మెయిల్'
- December 31, 2020
2020లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్తో అలరించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా డైరెక్టర్ ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన డిఫరెంట్ మూవీ ‘మెయిల్’. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తున్నారు.
ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్’ను తెరకెక్కించారు. బుధవారం మెయిల్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
నటీనటులు:
ప్రియదర్శి, హర్షిత్ మాల్గి రెడ్డి, మణి అగెరుల, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఉదయ్ గుర్రాల
నిర్మాతలు: ప్రియాంక దత్, స్వప్న దత్
సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాల, శ్యామ్ దుపాటి
మ్యూజిక్: స్వీకార్ అగస్తి
ఎడిటర్: హరి శంకర్ టి.ఎన్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు