తాను పండించిన కూరగాయలను దుబాయ్ పంపనున్న MS ధోని...
- January 02, 2021
ఝార్ఖండ్:టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత వ్యవసాయం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాను పండించిన ఆ కూరగాయలను దుబాయ్ కి పంపనున్నాడు ధోని. తన ఫామ్ హౌస్‌లో పండించిన కూరగాయలను దుబాయ్‌కు పంపించడానికి సన్నాహాలు కూడా చివరి దశలో ఉన్నాయి. దుబాయ్‌కు కూరగాయలు పంపే ఏజెన్సీని కూడా ఎంపిక చేశారు. అయితే ధోని కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది. ''ఆల్ సీజన్ ఫార్మ్ ఫెష్ ఏజెన్సీ'' ధోని కూరగాయలను దుబాయ్‌లో విక్రయించనుంది. అయితే ఇదే ఏజెన్సీ ద్వారా జార్ఖండ్ వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలియజేశారు. ధోని ఒక బ్రాండ్... కాబట్టి అతని పేరుతో కూరగాయలను పంపిస్తే... ఇక్కడి రైతులు కూడా లాభం పొందుతారు. ఇన్ని రోజులు ఇక్కడికి రావటానికి ఇష్టపడని ఏజెన్సీలు కూడా ఇప్పుడు ఇక్కడకు వస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







