డ్రంక్ & డ్రైవ్:మందు బాబులకు ఝలక్ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు..
- January 04, 2021_1609737707.jpg)
హైదరాబాద్:డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం తాగి డ్రైవిండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 346 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో దాదాపు 26 నుంచి 45 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక పట్టుబడ్డ వాహనాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పూర్తిగా అరికట్టే వరకు ఈ తనిఖీ చేస్తామని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, గత వారం రోజులుగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో సైబరాబాద్ పరిధిలో 3751 డీడీ కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..