'HYDXB-VAXCOR' ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకాలు చేసిన GMR హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్,దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్
- January 04, 2021·ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను తరలించే ప్రక్రియలో ఎదురయ్యే రవాణా సమస్యలను పరిష్కరించడంలో మొదటి ప్రయత్నం
·వ్యాక్సిన్ల ఉత్పత్తిలో గ్లోబల్ హబ్ అయిన హైదరాబాద్, గ్లోబల్ ఎయిర్ కార్గో హబ్ అయిన దుబాయ్‌ల ప్రత్యేక భాగస్వామ్యం
·కోవిడ్ -19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా, సమర్థవంతంగా తరలించడంలో హైదరాబాద్-దుబాయ్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను గ్లోబల్ గేట్‌వేగా మార్చే ఒప్పందం
·వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ సదుపాయాలను మెరుగుపరుస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో
·వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ సెంటర్‌గా తన ప్రత్యేక స్థానాన్ని ఉపయోగించుకోనున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను, సమర్థవంతమైన ఫార్మా పరిశ్రమలను కలిగి ఉన్న భారతదేశం, కోవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీలో చాలా వ్యూహాత్మక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్, దాని సమీప ప్రాంతాలు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఉన్నందున, భారత్ నుంచి తయారయ్యే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా తయారీదారుల దిగుమతి అవసరాలను తీర్చడంతో పాటు కోవిడ్ -19 వ్యాక్సిన్ల దేశీయ పంపిణీలో హైదరాబాద్ విమానాశ్రయానికున్న కనెక్టివిటీ బాగా ఉపయోగపడుతుంది.
ఈ నేపథ్యంలో, GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మరియు GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GMR-HYD) మరియు దుబాయ్ విమానాశ్రయాలు కలిసి ‘HYDXB-VAXCOR’ (హైదరాబాద్ - దుబాయ్ గ్లోబల్ వ్యాక్సిన్ కారిడార్) అనే ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రదీప్ పణికర్, సీఈఓ-జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం,సౌరభ్ కుమార్, సీఈఓ-హైదరాబాద్ ఎయిర్ కార్గో,యూజీన్ బారీ, ఈవీపీ-కమర్షియల్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ కలిసి ఒక వర్చువల్ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, GMR-HYD మరియు దుబాయ్ విమానాశ్రయాలు “HYDXB-VAXCOR”లో భాగంగా వివిధ ఖండాలకు రవాణా అయ్యే టెంపరేచర్-సెన్సిటివ్ వ్యాక్సిన్ రవాణాకు ప్రాధాన్యతనిస్తాయి. ఈ ఒప్పందం వల్ల కస్టమైజ్డ్, సరళీకృత ప్రక్రియల ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుండి విమానాశ్రయం, అక్కడి నుంచి హబ్ లాజిస్టిక్స్, అటు నుంచి ఎండ్-కస్టమర్లకు వ్యాక్సిన్ల డెలివరీని క్రమబద్ధీకరిస్తారు.
ఈ ఒప్పందంలో భాగంగా, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా కోసం GMR-HYDని వ్యూహాత్మక ఎయిర్‌కార్గో భాగస్వామిగా గుర్తించింది. అదే సమయంలో GMR-HYD, దుబాయ్ విమానాశ్రయాన్ని గ్లోబల్ వ్యాక్సిన్ సరఫరా గొలుసును సులభతరం చేసే కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉపయోగించుకుంటుంది.ఈ భాగస్వామ్యం ద్వారా పరస్పర టెక్నాలజీ సహకారాన్ని కూడా అందించుకుంటారు.ఈ ఒప్పందం కింద రెండు సంస్థలు ఒక సమగ్ర ఐటి సొల్యూషన్‌పై కలిసి పని చేస్తాయి.దీని వల్ల వినియోగదారులకు HYD, DXB మధ్య మరియు వివిధ ప్రపంచ గమ్యస్థానాలకు రవాణా అయ్యే కార్గో మరియు వ్యాక్సిన్ల ఉష్ణోగ్రత, వాటి ట్రాకింగ్‌తో సహా ఎండ్-టు-ఎండ్ సేవలు అందుతాయి.
దీనిపై వ్యాఖ్యానిస్తూ,ప్రదీప్ పణికర్, సీఈఓ, జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, “భారతదేశం నుంచి వ్యాక్సిన్ ఎగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఎప్పుడూ ఒక ముఖద్వారంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్లను సురక్షితంగా, సమర్థవంతంగా రవాణా చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక, సహకారాలు అవసరం.అందుకే కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడం కోసం మేము దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌తో "HYDXB-VAXCOR" ఒప్పందం కుదుర్చుకున్నాము. కోల్డ్ టు అల్ట్రా-కోల్డ్ ఉష్ణోగ్రత పరిధులు అవసరమైన కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం మా సామర్థ్యాన్ని గణనీయంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాము. తద్వారా వ్యాక్సిన్ల ఎగుమతి/దిగుమతులు మరియు వ్యాక్సిన్ల దేశీయ పంపిణీలో మేం భారతదేశపు అతిపెద్ద ఎయిర్ కార్గో కేంద్రంగా అవతరించాము. ” అన్నారు.
ఎస్‌జీకే కిషోర్, ఈడీ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, జీఎంఆర్ గ్రూప్, ‘‘ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల రవాణాకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్,వ్యాక్సిన్ల రవాణా ఎలాంటి ఆటంకాలూ లేకుండా జరగడానికి తోడ్పడుతుంది.’’ అన్నారు.
దుబాయ్ విమానాశ్రయాల సిఇఒ పాల్ గ్రిఫిత్స్ "రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను సమర్థవంతంగా, సురక్షితంగా పంపిణీ చేయడానికి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మేము ఆ డిమాండ్‌కు తగినట్లు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాము . వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో చివరి దశలోకి ప్రవేశించిన నేపథ్యంలో GMR- హైదరాబాద్‌తో మా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాం.” అన్నారు.
GMR-HYD అనేక ప్రధాన వ్యాక్సిన్ తయారీదారులకు సమీపంలో ఉంది. యూరప్, ఆఫ్రికా, అమెరికా మరియు ఆసియాలోని మార్కెట్లను లక్ష్యంగా చేసుకొన్న వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. టెంపరేచర్ సెన్సిటివ్ వ్యాక్సిన్ కార్గోను నిర్వహించే హైదరాబాద్ విమానాశ్రయం, దుబాయ్ విమానాశ్రయంలాంటి ప్రధాన హబ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాటిని పంపిణీ చేస్తుంది. GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ఫార్మా, వ్యాక్సిన్ రవాణాలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మంచి నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) గుర్తింపు పొందిన సర్టిఫైడ్ కార్గో విమానాశ్రయం. ఇది భారతదేశం యొక్క మొదటి డెడికేటెడ్ ఫార్మా జోన్, అతి పెద్ద టన్నెల్ ఎక్స్-రే మెషిన్ మరియు కోవిడ్ వ్యాక్సిన్ల సురక్షిత రవాణాకు కీలకమైన ఎన్విరోటైనర్, వా-క్యూ-టెక్, సీసేఫ్, డోకాస్చ్ వంటి వివిధ కూల్ కంటైనర్ల ప్రధాన స్టాకింగ్ స్టేషన్లలో ఒకటి.
కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల నిర్వహణలో ప్రత్యేకమైన అవసరాల కోసం GMR-HYD ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్ సదుపాయాలను పెంచి, వాటిని ఒక క్రమంలో నిర్వహించే ప్రక్రియలను చేపడుతోంది. GMR-HYD ఇప్పటికే ఒక పెద్ద, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తయారు చేయించిన కూల్ డాలీని ప్రారంభించింది.ఇది ఎయిర్ సైడ్ రవాణాలో విమానాన్ని ఎక్కించేంత వరకు ఆటంకాలు లేకుండా వ్యాక్సిన్లు లేదా ఇతర సరుకుల కోల్డ్-చైన్‌ను కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!