సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడకు స్పెషల్ ఫ్లైట్స్..
- January 04, 2021హైదరాబాద్:కొత్త ఏడాదిలో వచ్చే మొదటి పెద్ద పండుగ.. ఆంధ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుక సంక్రాంతి సందడి అప్పుడే మొదలైపోయింది. ఎక్కడెక్కడ ఉన్న ఏ.పీకి చెందిన ఇళ్లకు చేరుకుంటారు. రద్దీని తట్టుకునేందుకు ప్రభుత్వం స్పెషల్ బస్సులు, రైళ్లు వేసినా జనం పండుగ సమయంలో ఊరెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్రయాణీకులకు మరి కొంత వెసులు బాటు కల్పించేందుకు వీలుగా ఇండియన్ ఎయిర్ వేస్ ఏ.పీకు స్పెషల్ విమానాలు నడిపేందుకు రెడీ అయింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్ జెట్ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక విమానాలు ప్రకటించింది. ఈ విమానం ఎక్కితే కేవలం గంటలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లొచ్చు. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉన్నాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా స్పైస్‌జెట్ విమాన సంస్థ విడుదల చేసింది.
స్పైస్ జెట్ విమాన సర్వీసుల వివరాలు..
జనవరి 10 నుంచి ప్రతి రోజు సాయింత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి 5.30 కల్లా విజయవాడ చేరుతుంది. అలాగే సాయింత్రం 6గంటలకు విజయవాడలో బయల్దేరి రాత్రి 7.10కి హైదరాబాద్ చేరుతుంది. అలాగే జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో ప్రారంభం కానుంది. ఈ విమానం ప్రతి రోజు మధ్యాహ్నం 3.20కు బయల్దేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది. ఇది జనవరి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఇక జనవరి 11 నుంచి 28వ తేదీ వరకు మరో కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయల్దేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది.
తాజా వార్తలు
- BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం