యుకె:మళ్లీ లాక్డౌన్.. కొత్త స్ట్రెయిన్ కలకలం
- January 05, 2021_1609828884.jpg)
లండన్:ఇంగ్లండ్‌లో దాదాపు 56 మిలియన్ల మంది ప్రజలు మళ్లీ లాక్డౌన్ ఆంక్షల్లో ఉన్నారు. ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగే ఈ లాక్డౌన్ ద్వారా స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ రేట్లను తగ్గించడానికి ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం చెప్పారు. ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలల మూసివేతతో సహా ఈ చర్యలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే దేశంలో అనేక మంది కరోనాతో మరణించారు. జాన్సన్ మాట్లాడుతూ, సోమవారం నాటికి, కోవిడ్‌తో దాదాపు 27,000 మంది ఆసుపత్రిలో ఉన్నారు - గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన కరోనా కేసుల గరిష్ట స్థాయి కంటే 40 శాతం ఎక్కువ అని అన్నారు. గత మంగళవారం, కేవలం 24 గంటల్లో 80,000 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో చాలా మంది ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ బారిన పడినందున టీకాలు తయారుచేసేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వేరియంట్‌ను అదుపులోకి తీసుకురావడానికి కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం