రస్ అల్ ఖైమాలో సెక్యూరిటీ కెమెరాలు
- February 22, 2016
క్రైమ్ రేట్ తగ్గించడానికీ, అలాగే భద్రత పెంచడానికి అధికారులు ఎమిరేట్ వ్యాప్తంగా సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమైన భవనాలు, పబ్లిక్ స్పేసెస్ మరియు, స్ట్రీట్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు ధృవీకరించారు. 40,000 ఎస్టాబ్లిష్మెంట్స్, వీటిల్లో ఎక్కువగా ఫెడరల్ మరియు లోకల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇక నుంచి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల పర్యవేక్షణలోకి వెళ్ళనున్నాయి. వారంలో ఏడు రోజులు, రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ కెమెరాలు పనిచేస్తాయి. రస్ అల్ ఖైమా కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నువామి ఈ వివరాల్ని వెల్లడించారు. 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన అన్నారు. రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి డైరెక్షన్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని చెప్పారాయన. కెమెరాల్లో చిత్రీకరించిన విజువల్స్‌ని 90 రోజులపాటు నిక్షిప్తం చేసేందుకూ తగిన ఏర్పాట్లున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు మాత్రమే ఈ కెమెరాల్లోని విజువల్స్‌ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







