కువైట్ లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు..నలుగురికి గాయాలు
- January 06, 2021
కువైట్ సిటీ:కువైట్ లో రెండు వేర్వేరు ప్రాంతాలు అగ్ని ప్రమాదాలు సంభవించాయి.ఈ ఘటనలో ముగ్గురు ప్రవాస కార్మికులతో పాటు మరో డొమస్టిక్ వర్కర్ కు గాయాలయ్యాయి. గాయాలైన వారితో పాటు అస్వస్థకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు వెల్లడించారు. అల్ నైమ్ ప్రాంతంలో ప్రవాసీయులు ఉన్న ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..సమాచారం అందగానే ఫైర్ సెఫ్టీ సిబ్బంది హటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆర్పివేశారు. అయితే..మంట సెగలు, పొగతో ముగ్గురు ప్రవాసీయులు అస్వస్థకు గురవగా..వారికి వెంటనే కావాల్సిన చికిత్స అందించారు. మరోవైపు అల్ ఘరీబ్ ప్రాంతంలో రెండో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంట గది నుంచి మంటలు వ్యాపించాయని, అయితే..ఇతర గదులకు మంటలు వ్యాపించకముందే ఆర్పివేశామని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో డొమస్టిక్ వర్కర్ ఒకరు అస్వస్థకు గురయ్యారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







