'క్రాక్' ప్రీ రిలీజ్ ఫంక్షన్
- January 06, 2021
హైదరాబాద్:మాస్ మహరాజ్ రవితేజ హీరోగా చేస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ సినిమా క్రాక్ ప్రీ రిలీజ్ నేడు జరిగింది. ఈ సందర్బంగా ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ... నాకు సినిమా లైఫ్ ఇచ్చింది రవితేజ. ఆయనతో ఇది నా మూడో సినిమా. ఇప్పటివరకు సూపర్ హిట్ కాంబినేషన్ గా ఉన్న మా కాంబినేషన్ ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవుతుంది అని తెలిపాడు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో జరిగిన నిజమైన సంఘటనలతో ఈ సినిమా రూపొందించాము. ఈ సినిమాలోని ప్రతి పాత్ర నిజమైన పాత్రే అని పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా గురించి చాలా చెప్పాల్సి ఉంది. అదంతా సినిమా సక్సెస్ మీట్ లో చెప్తాను అని గోపీచంద్ అన్నారు.
ఇక ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. కరోనా కారణంగా తెలుగు సినిమా 9 నెలలు ప్రసవ వేదన అనుభవించింది అని అన్నారు. లాక్ డౌన్ కు ముందు తెలుగు సినీ పరిశ్రమ నెంబర్ వన్ స్థానంలో ఉంది అన్నాడు. అలాగే రవితేజ గురించి మాట్లాడుతూ... నా లైఫ్ లో రవితేజ చాలా కీలక అని అన్నారు. అలాగే భద్ర సినిమా నుండి ఆయన నాకు తెలుసు అని చెప్పిన వంశీ పైడిపల్లి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని.. మళ్ళీ ఈ సినిమాతో టాలీవుడ్ పాత రోజులను చూస్తుంది అని అన్నారు.
రవితేజకు సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి మాట్లాడుతూ... గత సంక్రాంతికి తెలుగు సినిమాల పై కాసుల వర్షం కురిసింది. ఇప్పుడు మళ్ళీ క్రాక్ సినిమాకు అది రిపీట్ అవుతుంది అని అన్నారు. అలాగే నాకు ఇష్టమైన హీరో రవితేజ అంటేనే ఫైర్. ఆయనలో ఉన్న ఆ ఫైర్ ను వాడుకున్న దానిపై సినిమా హిట్ అనేది ఆధారపడుతుంది అన్నారు. అయితే ఈ సినిమాలో ఆ ఫైర్ ను గోపీచంద్ బాగా వాడుకున్నాడు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు