ఏప్రిల్ నుంచి ఒమాన్ లో వ్యాట్ అమలు..94 ఫుడ్ ఐటమ్స్ కు మినహాయింపు

- January 07, 2021 , by Maagulf
ఏప్రిల్ నుంచి ఒమాన్ లో వ్యాట్ అమలు..94 ఫుడ్ ఐటమ్స్ కు మినహాయింపు

మస్కట్:గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏప్రిల్ నుంచి పలు వస్తువుల  ఉత్పత్తులపై వస్తువుల విలువ ఆధారిత పన్ను-వ్యాట్ ను అమలులోకి తీసుకువస్తున్నట్లు ఒమాన్ ప్రకటించింది. 94 అహార పదార్ధాల ఉత్పత్తులు మినహా అన్ని ఉత్పత్తులను వ్యాట్ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. వ్యాట్ అమలు ద్వారా 780 యూఎస్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆదాయం బడ్జెట్ లోటును పూడ్చేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. వ్యాట్ అమలుకు సంబంధించి గురువారం కీలకమైన మూడు కార్వనిర్వాహక నిర్ణయాలను వెలువరించింది. ఇందులో మొదటిది..ఏదైనా కంపెనీ, ఫ్యాక్టరీలు తమ వార్షిక ఉత్పత్తి లక్ష యూఎస్ డాలర్లు లేదా అంతకు మించి ఉన్నా..లక్ష డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నా ట్యాక్స్ అథారిటీ దగ్గర ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 50 వేల డాలర్ల వార్షిక ఉత్పత్తి ఉన్నా..లేదా అంతవరకు ఉత్పత్తి ఉండొచ్చనే అంచనాలు ఉన్నా... అంతకు మించి ఉత్పత్తి ఉన్నా స్వచ్ఛదంగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.

ఇక రెండో నిర్ణయం ప్రకారం..వార్షిక ఉత్పత్తి 2,600 డాలర్లుగా ఉన్నా లేదా ఆ లక్ష్యాన్ని చేరువచ్చనే అంచనాలు ఉన్నా..అంతకుమించి ఉత్పత్తి జరుగుతున్నా..ఆయా పన్ను చెల్లింపుదారులు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేటగిరి పన్ను చెల్లింపు దారులు అంతా ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ పరిధిలోకి వస్తారు. ఇక 1300 డాలర్ల మేర వార్షిక ఉత్పత్తి ఉన్న ట్యాక్స్ పేయర్స్ ఏప్రిల్ నుంచి జులై 1లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్ధిక శాఖ విడుదల చేసిన మూడో నిర్ణయం మేరకు 94 రకాల అహార ఉత్పత్తులకు మినహాయింపు వర్తించనుంది. మాంసం, చేపలు, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, తాజా గుడ్లు, కూరగాయలు, పండ్లు, కాఫీ బీన్స్, టీ, యాలకులు, పప్పు ధాన్యాలు, ఆలివ్ ఆయిల్, చక్కెర, పిల్లలకు సంబంధించిన అహార ఉత్పత్తులు, రొట్టె, బాటిల్ వాటర్, టేబుల్ ఉప్పు వంటి వాటికి వ్యాట్ నుంచి మినహాయింపు ఉండనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com