'డీ43' షూటింగ్ ప్రారంభం
- January 08, 2021చెన్నై:తమిళ, తెలుగు రాష్ట్ర ప్రజలకు హీరో ధనుష్ పేరు పరిచయం అక్కర్లేదు. తనదైన కథలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ధనుష్ సినిమా అంటే కొత్తగా ఉంటుందని ప్రేక్షకుడు భావిస్తాడు. అయితే ధనుష్ తుల్లువాదో ల్లమాయి అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నటన కథల ఎంపికతో స్టార్ హీరోగా ఎదిగాడు. హాలీవుడ్ సైతం ధనుష్‌తో చేసేందుకు మొగ్గు చూపుతోంది. అయితే ధనుష్ నూతన చిత్రం డీ43 నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను ప్రారంభించుకుంది. ఈ సినిమా థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇందులో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుంది. ఈ థ్రిల్లర్ సినిమాని కార్తిక్ నారెన్ తనదైన దర్శకత్వంతో రూపొందించనున్నాడు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం