తెరుచుకున్న సౌదీ-ఖతార్ సరిహద్దులు..3 ఏళ్ల తర్వాత సౌదీలోకి తొలి కారు
- January 09, 2021
మూడేళ్ల తర్వాత సౌదీ అరేబియా-ఖతార్ సరిహద్దులు తెరుచుకున్నాయి. రెండు గల్ఫ్ దేశాల మధ్య వివాదాలు సమసిపోయి దౌత్య సంబంధాలు పునురుద్ధరించుకున్న తర్వాత..పలు కీలక నిర్ణయాలు వెలువుడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు దేశాల మధ్య విమానాలు, రహదారి సరిహద్దులు, సీ పోర్టుల ద్వారా రవాణా ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియాలో ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శనివారం తొలిసారిగా ఖతార్ నుంచి బయల్దేరిన కారు సాల్వా సరిహద్దు మీదుగా సౌదీ అరేబియాకు చేరుకుంది. అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. సాల్వా సరిహద్దు దగ్గర కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖతార్ నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ చూపించాలని..అలాగే కోవిడ్ టెస్ట్ తో పాటు మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







