ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త మార్గనిర్దేశకాలు విడుదల చేసిన కువైట్
- January 10, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి విదేశాలకు ప్రయాణం చేసే పౌరులు, ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ కొత్తగా మార్గనిర్దేశకాలు జారీ చేసింది. కువైట్ నుంచి బయల్దేరే ప్రయాణికుల నుంచి కొన్ని దేశాలు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను అడుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా అగ్నేయ అసియా దేశాలు పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ను తప్పనిసరి చేశాయని, వాటి అమలును ఖచ్చితంగా పాటిస్తున్నాయనే విషయాన్ని ప్రయాణికులు గుర్తుంచుకోవాలని సూచించింది. కొన్ని దేశాలు అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తో పాటు ఇమ్యూనోలాజికల్ ఎగ్జామినేషన్ ఫలితాలను కూడా అడుగుతున్నాయి. ప్రయాణికుడు గతంలో వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నాడా లేదా అనేది ఇమ్యూనోలాజికల్ ఫలితాల ద్వారా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చైనా పలు జాగ్రత్తలు పాటిస్తోందని, పీసీఆర్ టెస్ట్, ఇమ్యూనోలాజికల్ రిజల్ట్ తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్లను కూడా కోరుతోందని తమ దేశం నుంచి ప్రయాణించే ప్రయాణికులకు కువైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







