అక్కడ కరోనా ధాటికి స్మశానాలు ఖాళీ లేవు! తాత్కాలిక శ్మశానాల ఏర్పాటు!!

- January 10, 2021 , by Maagulf
అక్కడ కరోనా ధాటికి స్మశానాలు ఖాళీ లేవు! తాత్కాలిక శ్మశానాల ఏర్పాటు!!

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గత యేడాదికి పైగా అతలా కుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి తొలి దశలో చైనా కంటే అమెరికా, ఇటలీలను సర్వనాశనం చేసేసింది. ఇక ఇప్పుడు కొత్త కరోనా కేసులతో మరోసారి అగ్రరాజ్యం అమెరికా మరింత దయనీయ స్థితికి చేరుకుంటోంది. కొత్త కరోనా కేసులు అమెరికాలో రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గురువారం ఒక్క రోజే ఏకంగా 2.65 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే మళ్లీ అక్కడ కరోనా ఏ రేంజ్లో విజృంభిస్తోందో అర్థమవుతోంది. ఒక్క రోజులోనే అక్కడ ఏకంగా 3676 మంది కరోనా ఎఫెక్ట్‌తో మృత్యువాత పడ్డారు.

ఇక మరో రెండు రోజుల్లో ఈ కరోనా కేసులు రోజుకు 3 లక్షలు దాటి పోతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ 2.18 కోట్ల మందికి పాజిటివ్ నమోదు అయ్యింది. సుమారుగా 3.70 లక్షల మంది మరణించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను కరోనా ఇప్పటికే కుప్ప కూల్చగా తాజాగా కొత్త కరోనా వైరస్ సైతం అమెరికాను ఇప్పట్లో కోలుకోనీయకుండా చేసేలా ఉంది. ఓ వైపు కరోనా వ్యాక్సిన్ అత్యంత పగడ్బందీగా వేస్తున్నా కూడా కరోనా కేసుల పెరుగుదల మాత్రం ఆగడం లేదు.

తొలి దశలో భాగంగా ఇప్పటి వరకు 6.6 లక్షల మిలియన్ల అమెరికన్ పౌరులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. అయితే ఇవి పెరుగుతోన్న కేసులతో పోలిస్తే ఏ మాత్రం సరిపోవడం లేదని చెపుతున్నారు. ఇక కేసుల సంఖ్య ఇలా పెరిగి పోతుంటే మరణించిన వారిని ఖననం చేసేందుకు స్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. అమెరికాలో చిన్నా చితకా శ్మశానాలు కూడా ఫుల్ అయిపోయాయి. ఇక కరోనా రోగులకు వైద్యం అందించేందుకు అటు ఆసుపత్రులూ ఖాళీ లేవు.

ఈ సంఘటనలను బట్టే అమెరికాలో కరోనా సంక్షోభం మళ్లీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలుస్తోంది. ఈ పరిస్థితి నుంచి అమెరికా ఎప్పుడు భయటకు వస్తుందో ? కూడా అర్థం కావడం లేదు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com