అరుదైన ఘనతను సొంతం చేసుకున్న నలుగురు మహిళా పైలెట్లు
- January 11, 2021
బెంగళూరు:ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలెట్లు సుదూరం ప్రయాణం చేసిన అరుదైన ఘనతను సొంతంచేసుకున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరిన వీరు ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు. సుమారు 16,000 కి.మీ దూరం ప్రయాణం చేసి, ఈ ఘనతను సాధించినందుకు నలుగురు పైలెట్లు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు తాము ప్రపంచ రికార్డు నెలకొల్పామని, ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాకుండా.. అంతా మహిళా పైలట్లే ఈ సాహసాన్ని పూర్తి చేయడం విశేషమని, చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ మార్గంలో రావడంతో 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగామని నలుగురు పైలట్లలో ఒకరైన కెప్టెన్ జోయా అగర్వాల్ ప్రకటించారు.

కాగా, ఈ బృందంలో తెలుగమ్మాయి పాపగారి తన్మయి కూడా ఉన్నారు. కాగా, అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా మహిళా పైలెట్లు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అపారమైన అనుభవం ఉన్న పైలెట్లకు మాత్రమే దక్కే ఈ అరుదైన అవకాశం ఎయిరిండియాకు చెందిన మహిళా బృందం సొంతం చేసుకుంది. ప్రపంచలోనే రెండో పొడవాటి బోయింగ్ విమానాన్ని నడపడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
భౌగోళికంగా బెంగళూరు, శాన్‌ఫ్రాన్సిస్కోలు ఉత్తరధ్రువం చెరోవైపు ఉంటాయి. 17 గంటల్లో వారు తమ ప్రయాణాన్ని పూర్తి చేయగలిగారు. కాగా, మహిళా పైలట్లు ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు చెందిన మహిళల సత్తా ప్రపంచం నలుమూలలా చేరిందని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







