యూఏఈలో చిక్కుకున్న 54 మంది భారతీయులు..సౌదీ చేరుకుంటున్నారు

- January 11, 2021 , by Maagulf
యూఏఈలో చిక్కుకున్న 54 మంది భారతీయులు..సౌదీ చేరుకుంటున్నారు

యూఏఈ:బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వెలుగుచూడటంతో యూఎఈలో చిక్కుకున్న భారతీయులు వారి గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. తాజాగా 54 మంది భారతీయులు సౌదీ అరేబియా వెళ్లేందుకు ఆదివారం రోజు బస్సులో బయల్దేరారు.వివరాల్లోకి వెళితే..కోవిడ్-19 తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల మధ్య రాకపోకపోకలు సాధరణ స్థితికి చేరుకుంటున్న తరుణం‌లో బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూసింది.కోవిడ్-19 కంటే కొత్త రకం కరోనా వ్యాప్తి 70 శాతం అధికంగా ఉంటుందని నివేదికలు రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కొత్త రకం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా, కువైత్ దేశాలు తమ సరిహద్దులను మూసేశాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. 

దీంతో ఉపాధి కోసం యూఏఈ గుండా కువైత్, సౌదీ అరేబియాకు వెళ్లేందుకు గత ఏడాది డిసెంబర్‌లో బయల్దేరిన సుమారు 600 మంది భారతీయులు యూఏఈలో చిక్కుకున్నారు.వారిని కేరళ ముస్లీం కల్చరల్ సెంటర్ అండ్ మర్కజ్ సభ్యులు చేరదీశారు. స్థానిక వ్యాపారుల సహాయంతో ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పించారు. తాజాగా కువైత్, సౌదీ అరేబియా దేశాలు ఆంక్షలను సడలించడంతో యూఏఈలో చిక్కుకున్న సుమారు 600మంది భారతీయులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇందులో దాదాపు 54 మంది సౌదీ అరేబియా వెళ్లేందుకు నిన్న బస్సులో బయల్దేరారు.ఈ విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సలేట్ జనరల్ కార్యాలయ అధికారి నీరజ్ అగర్వాల్ ధృవీకరించారు. అంతేకాకుండా వారి నుంచి ఎటువంటి బస్సు చార్జీలను వసూలు చేయలేదని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com