కొత్త ఎయిర్ పోర్ట్ టెర్మినల్ని ప్రారంభించనున్న బహ్రెయిన్
- January 11, 2021
మనామా:బహ్రెయిన్, జనవరి 28న కొత్త ప్యాసింజర్ టెర్మినల్ని ప్రారంభించనుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా కొత్త టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత మార్చిలోనే ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సి వుండగా, కరోనా వైరస్ పాండమిక్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎయిర్ పోర్టులో క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ పర్యటించి, అక్కడి పరిస్థితుల్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు డెస్టినేషన్లకు బహ్రెయిన్ రీజినల్ హబ్‌గా వ్యవహరించడంలో ఈ కొత్త ఎయిర్ పోర్టు కీలకంగా వ్యవహరించనుందని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో వున్న టెర్మినల్‌తో పోల్చితే కొత్త టెర్మినల్ నాలుగు రెట్లు పెద్దది. సంవత్సరానికి 14 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కార్ పార్కింగ్, డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఏరియా, రెండు రిసెప్షన్ హాల్స్, సెంట్రల్ యుటిలిటీస్ నిమిత్తం కాంప్లెక్స్ వంటివి ఇక్కడ కొలువు దీరాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







