ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత
- January 11, 2021
విజయవాడ:ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
1946లో 14 సంవత్సరాల వయసులోనే తుర్లపాటి పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. పాత్రికేయుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభాధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా ప్రసిద్ధికెక్కారు. మొత్తంగా 18 మంది ముఖ్యమంత్రుల వద్ద ఆయన పనిచేశారు. 2002లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి తెలుగు పాత్రికేయుడిగా రికార్డులకెక్కారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







