ప్రధాన నగరాలకు ఫ్లైట్ సర్వీసులను పెంచిన ఒమన్ ఎయిర్
- January 12, 2021
మస్కట్:ఒమన్ ఎయిర్ ప్రపంచంలోని పలు ప్రధాన నగరాలకు తమ ఫ్లైట్ సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్లుగా పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపిన ఒమన్ ఎయిర్ ఇప్పుడు వాటికి మరికొన్ని సర్వీసులను యాడ్ చేసింది. మస్కట్ నుంచి దోహాకు వారానికి 2 ఫ్లైట్స్ వెళ్తుండగా ఇప్పుడు వాటి సంఖ్యను 3కి పెంచింది. దుబాయ్ వెళ్లే ఫ్లైట్స్ ని 3 నుంచి 5కి, లండన్ ఫ్లైట్స్ ని 2 నుంచి 3కి పెంచింది. అలాగే మస్కట్ నుంచి హైదరాబాద్, ముంబై, కొచ్చి, ఢిల్లీ, చెన్నైతో పాటు ఖైరో, ఇస్లామాబాద్, లాహోర్ కు వెళ్లే ఫ్లైట్స్ సంఖ్యను కూడా పెంచుతున్నట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. అయితే...ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వివరించింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అలాగే ఫ్లైట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు విధిగా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. అలాగే ప్రయాణికులు దిగిన తర్వాత తగిన ప్రమాణాలతో విమానంలో డిసిన్ఫెక్షన్ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇక ఫ్లైట్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను ఇస్తున్నామని, ప్రయాణికుల అహార విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలిపింది. ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాము పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తల కోసం http://omanair.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలని ఒమన్ ఎయిర్ సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







